– నీళ్ళు నిలవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎయిర్ టేల్ ఆప్టిక్ ఫైబర్ కోసం తీస్తున్న గోతులు తో పంచాయితీ నీటి సరఫరా పైపులు ధ్వంసం అవుతున్నాయి.ఈ గోతులు లోతుల్లో ఎడతెరిపి లేని వానలకు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి.వావన దారులు ప్రమాదాలకు లోను అయ్యే అవకాశం ఉంది.
మండల పరిధిలోని గుర్రాల చెరువు నుండి అశ్వారావుపేట వరకు ఎయిర్టెల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు కోసం కోసం తారు రోడ్ సైడ్ బర్మ్ లో సుమారు ఇరవై గోతులు తీసారు.ఆ గోతులు కొన్ని పూడ్చారు,మరి కొన్ని గోతులు అస్సలు పూడ్చనే లేదు.ఇంకొన్ని అసంపూర్తిగా వదిలేసారు.రోడ్ కు ఒక వైపు గోతులు ఉండటం తో గత వారం రోజుల ఎడతెరిపిలేని వానలకు వరద నీటితో గోతులు నిండిపోయి ప్రమాదకరం గా వున్నాయి.సుమారు 40 రోజుల నుండి వీళ్ళు పనులు నిర్వహిస్తున్నారు.ఈ పనులతో ఊరి మధ్యలో పంచాయితీ నీటి సరఫరా పైప్ లైన్ మూడు చోట్ల ధ్వంసం అయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ధ్వంసం అయిన చోట మరమ్మత్తులు చేసినప్పటికీ అక్కడ నీరు లీక్ అవుతున్నాయని,దీంతో త్రాగు నీరు కలుషితం అవుతుందని వాపోతున్నారు.ఫైబర్ ఏర్పాటు కోసం జాయింట్ దగ్గర మార్జిన్ మట్టి కొట్టుకుపోయి రోడ్డు చాలాచోట్ల ధ్వంసం అవుతుంది.మారుతీ కాలనీ నుండి దొంతికుంట చెరువు వరుకు మార్జిన్ మొత్తం మట్టి తొలిగించి పూడ్చి నా రోలింగ్ చేయని కారణంగా మట్టి వర్షానికి కొట్టుకుపోయింది.
చర్యలు తీసుకుంటాం – ఇంచార్జి కార్యదర్శి స్వతంత్ర తేజ్
పనులు ప్రారంభించారు ఎడతెరిపిలేని వానలు సంభవించాయి.ఈ విషయం కంపెనీ ప్రతినిధులతో మాట్లాడాను. చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తాను.
పనులు ప్రారంభించారు ఎడతెరిపిలేని వానలు సంభవించాయి.ఈ విషయం కంపెనీ ప్రతినిధులతో మాట్లాడాను. చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తాను.