మృతుని కుటుంబానికి పంచాయతీ కార్మికుల పరామర్శ..

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని ముత్తన్నపేట గ్రామ పంచాయతీ కార్మికుడు కనగండ్ల రామయ్య ఇటీవల ఆనారోగ్య కారణాలతో మృతి చెందాడు. గురువారం మండల గ్రామ పంచాయతీ కార్మికుల సంక్షేమ సంఘ సభ్యులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికులు తమవంతు సహయంగా బాధిత కుటుంబానికి 50కిలోల బియ్య మందజేశారు. మండల గౌరవాధ్యక్షుడు బోనగిరి లక్ష్మన్, అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యక్షుడు శివకుమార్, బాబు, రాములు, రాజు, వినోద్, మల్లేశం, తిరుపతి, బాబు, అజయ్, మల్లేశం, కరుణాకర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.