పందిల్ల సర్పంచ్ రమేష్ కు సన్మానం

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

సర్పంచ్ ల ఐదు సంవత్సరాల కాలం పూర్తి కావడంతో హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామ సర్పంచ్ తోడేటి రమేష్ ను గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. గ్రామంలో సన్మాన సభ ఏర్పాటు చేసిన మహిళా సంఘం సభ్యులు  సర్పంచ్ రమేష్ లహరి దంపతులకు పుష్ప గుచ్చం అందజేసి సన్మానించారు. ఐదు సంవత్సరాలు కాలంలో గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. హుస్నాబాద్ మండలంలో పందిళ్ళ గ్రామానికి ప్రత్యేకత తీసుకువచ్చారని సర్పంచ్ రమేష్ ను అభినందించారు.