– టీఎస్‌టీటీఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పాఠశాల విద్యాశాఖలో పదోన్నతులు పొందని పండిట్, పీఈటీలకు వెంటనే పదోన్న తులు కల్పించాలని టీఎస్‌టీటీఎఫ్ రాష్ట్ర వ్యవ స్థాపక అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు పండిట్, పీఈ టీల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా శాఖ లోని ఇతర ఉపాధ్యాయుల్లాగా వీరికి కూడా పదో న్నతులు కల్పించాలని కోరారు. ఈ కార్య క్రమంలో సంతోష్, చక్రవర్తి, రాందాస్, రాధ, చంద్రం, అనిత, నాగస్వామి, మాధవి, మహేం దర్, అరుణ, వసంత, మాలతి తదితరులు పాల్గొన్నారు.