నూతన వధూవరులను ఆశీర్వదించిన  పాండురంగారెడ్డి

నవతెలంగాణ -పెద్దవూర
పెద్దవూర మండలం, పర్వేదుల గ్రామ వాస్తవ్యులు  అల్గుబెల్లి ఆదిరెడ్డి  కూతురు సాయిప్రియ వివాహం హైదరాబాదులోని, ఈదులకంటి రామిరెడ్డి గార్డెన్స్, సాగర్ రింగ్ రోడ్డు నందు నిర్వహించారు. సాయిప్రియ -నిరంజన్ రెడ్డిల వివాహ మహోత్సవానికి హాజరై శుక్రవారం నూతన వధూవరులను బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి  ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, తిరుమలగిరి సాగర్ మండలం మైనారిటీ సెల్ అధ్యక్షుడు నయీమ్ పాష, షేక్ ముస్తాఫ,మాజీ కో ఆపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి, అబ్దుల్ కరీం మరియు తదితరులు పాల్గొన్నారు.