నిరుపేదలకు ఆపద్భాందవుడు పాండురంగారెడ్డి

నవతెలంగాణ -పెద్దవూర
తిరుమలగిరి సాగర్ మండలం రంగుండ్ల గ్రామానికీ చెందిన రాయంచు వెంకన్నగత కొన్నాళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఈ విషయం బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్, శ్రీ వైష్ణవీ కన్ స్టక్షన్స్ అధినేత aబుసిరెడ్డి పాండు రంగారెడ్డి గ్రామస్తుల ద్వారా తెలుసుకునిబాధితుని ఇంటికి వెళ్లి  పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. ఇలా గత రెండేళ్లుగా నిరుపేదలకు, వృద్దులకు, పేద విద్యార్థులకు, వివిధ రుగ్నతులతో బాధపడుతున్న వారందరికీ అపద్భాంద వుడిగా తనవంతు ఆర్థిక సహాయం అడందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ యంపిపి, తిరుమలనాథ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి, కున్ రెడ్డి సంతోష్ రెడ్డి, ఇస్రం లింగస్వామి, గజ్జల శివానంద రెడ్డి, పొలోజు రమేష్ చారి, గజ్జల నాగార్జున రెడ్డి, గడ్డం సజ్జన్, రామకృష్ణారెడ్డి మరియు రంగుండ్ల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.