సేవాతత్పరుడు పాండురంగారెడ్డి

– నేనున్నానంటూ భరోసా..అంత్యక్రియలు అనంతరం ఉచిత భోజనాలు
నవతెలంగాణ -పెద్దవూర         
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం,పెద్దవూర మండలం, చలకుర్తి గ్రామానికి చెందిన తురక రాములు ( 55)గురువారం అనారోగ్యం తో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొని వారి కుటుంబానికి అండగా వున్నానంటూ బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి అంత్యక్రియలు అనంతరం ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా బుసిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడు అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించాలని తెలిపారు. నలుగురిని ఆదరిద్దాం.. అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.