
– పేదలకు అండగా
– యువతకు క్రికెట్ కిట్టు పంపిణీ
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా,నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆకస్మికంగా, అనారోగ్యం తో ఎవరు మృతి చెందిన ఆరోజు అక్కడికి వచ్చిన బంధువులకు అండగా నేనున్నానంటూ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విద్యార్థుల పేద, బడుగుల విద్యార్థుల చదువులకు కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఎంతోమందికి అండగా వుంటూ బుసిరెడ్డి పౌండష్ ద్వార సేవా తత్పరతను చాటుతున్నారు పాండు రంగారెడ్డి.ఆదివారం పెద్దవూర మండలం లోని పాల్తీ తాండ గ్రామ యువతకు క్రికెట్ కిట్ ను అందజేశారు.ఈసందర్బంగా బుసిరెడ్డి పాండు రంగారెడ్డి మాట్లాడుతూ ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడు అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించాలని తెలిపారు.నలుగురిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు,తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, యువకులు అశోక్, దత్తు,భరత్, మురళి, వంశీ,హీమలాల్, లక్ష్మణ్, సాయి, కృష్ణ, కుమార్, సాయి కుమార్, అరవింద్, ప్రవీణ్, నరేష్, పాల్గొన్నారు.