నవతెలంగాణ -పెద్దవూర
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం. పెద్దవూర మండల కేంద్రములోఆదివారం భవాని యూత్ ఆహ్వానం మేరకు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వైష్ణవి కన్ స్ట్రకన్స్,బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజకు విచ్చేసిన బుసిరెడ్డి పాండురంగారెడ్డిని శాలువాతో ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్,భవాని యూత్,గ్రామ యువకులు,గ్రామస్తులు,మరియు తదితరులు పాల్గొన్నారు.