ఏం అర్ పి ఈసందల కమిటీ అధ్యక్షులుగా పంగారు చిరంజీవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మహాజన మందకృష్ణ మాదిగారి ఆదేశాల మేరకు సంస్థాగత పునర్నిర్మానంలో భాగంగా జిల్లా మహిళా సంఘం నాయకురాలు మాక్లుర్ మండలం ఇన్చార్జి గుమ్ముట్టు పద్మ మాదిగ ఆధ్వర్యంలో మండలం ఎమ్మార్పీఎస్ కమిటీని మంగళవారం ఎన్నుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు సరికెల పోశెట్టి మాదిగ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సంస్థకు గత నిర్మనంలో భాగంగా ఈ యొక్క మండల కమిటీలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఆగస్టు 1- 2024 న ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అమలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చిందనీ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందుకు పిబ్రవరి 7న నిర్వహించు లక్షల డప్పులు వేల గొంతుకల “మహా సభను” విజయవంతం చేయాలని చలో హైదరాబాద్ కార్యక్రమానికి మాదిగలంతా ప్రతి ఒక్కరు డప్పులతో తరలి రావాలని కోరారు. ఏంఅర్పిఎస్ నూతన మండల కమిటీ అధ్యక్షులు పంగరి చిరంజీవి, ఉపాధ్యక్షులు కంఠం రమేష్, మగ్గిడి నర్సయ్య మాదిగ. మండల ప్రధాన కార్యదర్శి ఊల్లెంగ లక్ష్మణ్. మండల కార్యదర్శి నందిగం సంతోష్ మాదిగ లను ఎన్నుకొన్నారు. అదే విధంగా ఏం ఎస్ పి మండల కమిటీ అధ్యక్షులు గుడ్డోళ్ల భాస్కర్ మాదిగ, ఉపాధ్యక్షులు నిమ్మల రవి, పెండ ఆనంద్. అక్కనపల్లి రాజేశ్వర్. ప్రధాన కార్యదర్శి దేవుని వల్ల కాశిరమ్, కార్యదర్శి అమ్రాద్ ఒడ్డెన్న సలహాదారులు దర్గాల సాయిలు, తేడ్డు శేఖర్, బాబు, ఇందుర్ ఒడ్డేన్న లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జాతీయ నాయకురాలు యమునా, సత్తెక్క, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగారి భూమయ్య మాదిగ,మహిళా నాయకురాలు సుధా, తదితరులు పాల్గొన్నారు.