– ఏడు తరగతులకు 8 మందే విద్యార్థులు
– 10 దాటిన పాఠశాలకు రాని ఉపాధ్యాయులు
– వల్లపు రావుపల్లి లో ఏడు మంది ఉపాధ్యాయులను కలెక్టర్ సస్పెండ్ చేసిన మారని ఉపాధ్యాయుల తీరు
– పర్యవేక్షణ లోపంతోనే ఉపాధ్యాయుల ఇష్టా రాజ్యం
– సమయ పాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటాం : ఎంఈఓ మంజుల దేవి
నవతెలంగాణ-మిడ్జిల్
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతిస్తూ పాఠశాల ప్రారంభం కాకముందే ఎన్నో నిధులు కేటా యించి పాఠశాలలను బలోపేతం చేస్తుంటే ఉపాధ్యా యులు సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా పాఠశాలకు వచ్చి పోతున్నారు. మంగళవారం నవ తెలంగాణ వాడియాల, తమడకుంట తండా, వేముల, గొల్లోనికుంట తుల్జా నాయక్ తండ, లాక్యతండ, సింగం దొడ్డి, దోనూర్, వస్పుల, రాణి పేట పాఠశాలలను పరిశీలించారు.ఈ నెల 12న పాఠశాలలు ప్రారంభం కాగా కొన్ని గ్రామాలల్లో ఉపాధ్యాయులు పాఠశాలకి రాకుండా డుమ్మ కొడుతున్నారు. పాఠశాల ప్రారంభం నుండే ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు ఉచితంగా ప్రభుత్వం వేల రూపాయలు ఖర్చుపెట్టి అందిస్తుంటే ఉపాధ్యాయులు వేల రూపాయలు జీతాలు తీసుకుంటూ పాఠశాలలకు వస్తున్నామా లేదా అనే తీరుగా వచ్చిపోతున్నారు. ప్రాథమిక పాఠశాలలో ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 10 గంటలు దాటిన పాఠశాలకు ఉపాధ్యాయులురారు, విద్యార్థులు లేరు మండలంలోని వేముల గ్రామంలో ఏడు తరగతులకు నలుగురు ఉపాధ్యా యులు ఉండగా ఎనిమిది మంది విద్యార్థులు హాజరైనారు. 5 వ తరగతిలో ఒకే విద్యార్థి హాజరైనారు. గొల్లోని కుంట, తుల్జా నాయక్ తండాలలో 10:00 దాటిన పాఠశాల తెరువలేదు రాణిపేట పీిఎస్ పాఠశాలలో ఇద్దరు ఉపా ధ్యాయులు ఉండగా ఒక ఉపాధ్యాయురాలు హాజరైనారు. పర్యవేక్షణలోపంతోనే ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా విధులకు హాజరం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల తీరుపై మండి పడు తున్నారు. ఒక పక్క ప్రభుత్వం ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామని చెప్తున్న కొంతమంది ఉపా ధ్యాయులకు తీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలకు విద్యా ర్థులను పంపియాలంటేనే మా పిల్లలకు ప్రభుత్వ పాఠ శాలకు పంపిస్తే చదువు వస్తుందా రాదని విద్యార్థుల తల్లి దండ్రులకు ఆందోళన చెందుతున్నారు. ఒకపక్క ప్రైవేటు పాఠశాలలో ఫీజులు కట్టలేక, బుక్కులు కొనలేక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంవ త్సరం ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేస్తా మని చెప్పడంతో చాలామంది ప్రభుత్వ పాఠశాల వైపే విద్యార్థుల తల్లిదండ్రులు ముగ్గుసూపతున్నారు. కానీ ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా ఇష్టాను సారంగా విధులకు హాజరు కావడంతో విద్యార్థుల తల్లి దండ్రులు ప్రభుత్వ పాఠశాలపై సన్నగిల్లుతున్నారు. ప్రతి మండలానికి మండల విద్యాధికారి ఉంటే ఉపాధ్యాయులు సమయపాలన పర్యవేక్షణ చూసేవారు కానీ, ఇంచార్జీలతో మండల విద్యాధికారులను నియ మించడంతో ఉపాధ్యాయుల సమయపాలనపై పర్యవేక్షణ లోపంతో ఉపాధ్యాయులు ఇష్టం వచ్చినట్లు పాఠశాలకు హాజరవుతున్నారని ఉపాధ్యాయులు తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ మండ లంలోని వల్లపురావుపల్లి పాఠశాలలో ఉపాధ్యా యులు సమయపాలన పాటించడం లేదని జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో ఒకే పాఠశాలలో ఏడు మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినా ప్రభుత్వ పాఠ శాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల తీరు మారడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమయపాలని పాటించని ఉపాధ్యాయులపై శాఖ పరంగా చర్యలు తీసుకుంటా
విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించిన సహించేదే లేదని పాఠశాలలకు రాణి ఉపాధ్యాయులపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆమె తెలిపారు.
– ఎంఈఓ మంజులదేవి