నవతెలంగాణ- పెద్దవంగర: మండల పరిధిలోని వడ్డెకొత్తపల్లి, బొమ్మకల్లు గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో కేంద్ర బలగాల బృందం గురువారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ, ఎస్సై రాజు మాట్లాడుతూ.. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, మీ ఓటు హక్కును మీరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి, మీకెలాంటి భంగం కలగకుండా మీకు అందుబాటులో పోలీస్ సిబ్బంది ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై కుమారస్వామి, పోలీసులు పాల్గొన్నారు.