విభిన్న కథా చిత్రాలతో ఆకట్టుకుంటున్న విజరు ఆంటోనీ మరోమారు ఓ డిఫరెంట్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘పరాశక్తి’ అనే పేరుతో ఈ సినిమా రాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘అరువు’, ‘వాజిల్’ వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు, రచయిత అరుణ్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘వినూత్న కథాంశాలతో వైవిద్యభరితమైన పాత్రలతో విజరు ఆంటోనీ అందర్నీ అలరిస్తున్నారు. ఇది ఆయన నటిస్తున్న 25వ చిత్రం. ఈ సినిమాలోని ఆయన అసాధారణమైన నటన ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తుంది. విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌లోనూ ఆయన గన్ పట్టుకుని ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు మాస్ అప్పీల్, అత్యుత్తమ యాక్షన్, హదయాన్ని హత్తుకునే కుటుంబ కథ ఎలిమెంట్స్ కలిగి ఉంది’ అని చిత్ర యూనిట్ తెలిపింది. విజరు ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రాన్ని మీరా విజరు ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో విజరు ఆంటోనితో పాటు వాగై చంద్రశేఖర్, సునిల్ కష్ణ, సెల్ మురుగన్, త్రుప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి ప్రతిభావంతమైన నటీనటులు భాగంగా ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా రాబోయే వేసవిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి రచయిత-దర్శకుడు: అరుణ్ ప్రభు, సినిమాటోగ్రఫీ: షెల్లీ కాలిస్ట్, సంగీతం: విజరు ఆంటోనీ, ఎడిటింగ్: రేమండ్ డెరిక్ క్రస్టా, యాక్షన్ కొరియోగ్రఫీ: రాజశేఖర్.