– రోగుల అవస్థలు
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలో వైద్య సేవలు స్తంభించాయి. నిజామాబాద్ నగరంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రిలోనూ వైద్య సేవలు స్వచ్ఛందంగా నిలిపి వేయడంతో రోగులు అవస్థలు పడ్డారు. కోల్కతలోని ఆర్టీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనకు మద్దతుగా శనివారం 24 గంటలు వైద్య సేవలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) నిలిపివేయాలని పిలుపు నిచ్చింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా 24 గంటలపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీని నిలిపేస్తున్నట్లు, కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని పిలుపునిచ్చారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం నుంచి జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు జూడ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా మద్దతుగా నిలిచారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం స్పందించింది. దేశ్యాప్తంగా 24 గంటల పాటు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో వైద్య సేవలు స్తంభించిపోయాయి. ఔట్ పేషెంట్ విభాగాలు మూతపడ్డాయి. అత్యవసరం మినహా మిగిలిన అన్ని రకాల వైద్య సేవలను డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది బహిష్కరించారు. దీంతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేయడంతో పేషెంట్లు పడిగాపులు కాస్తున్నారు. వివిధ ప్రాంతాలలో ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా మద్దతుగా నిలిచారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం స్పందించింది. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఆసుపత్రుల్లో వైద్య సేవలు స్తంభించిపోయాయి. ఔట్ పేషెంట్ విభాగాలు మూతపడ్డాయి. అత్యవసరం మినహా మిగిలిన అన్ని రకాల వైద్య సేవలను డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది బహిష్కరించారు.దీంతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేయడంతో పేషెంట్లు పడిగాపులు కాస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు చేరుకున్న రోగులు ఇబ్బందులకు గురి అవుతున్నారు.