తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలను అప్రమత్తంగా ఉంచాలి

– ఎన్.ఎస్.యు.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రెహమాన్
నవతెలంగాణ భీంగల్: జిల్లాలో వరుసగా జరుగుతున్న కిడ్నాప్ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయని కనుక తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉంచాలని ఎన్.ఎస్.యు.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రెహమాన్ ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లలను కిడ్నాపర్ల బారి నుండి కాపాడవలసిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఉందని కనుక పాఠశాలల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, తల్లిదండ్రులు వారి పిల్లలకు అపరిచితులతో మాట్లాడవద్దని అపరిచితులు ఇచ్చిన తిను బండారాలు తినకూడదని సూచించాలని అలాగే పాఠశాలలో చిన్నారులకు ఉపాధ్యాయులు కిడ్నాప్ లకు సంబంధించిన విషయాల పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు.
తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంటి వద్ద ఒక కంట కనిపెడుతూ ఉండాలని అలాగే పాఠశాలకు వచ్చే చిన్నారులను ఉపాధ్యాయులు ఎల్లవేళలా పర్యవేక్షిస్తూ ఉండాలని ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పిల్లలను వారి తల్లిదండ్రులతో కాకుండా వేరే ఇతర వ్యక్తులకు ఇచ్చి పంపకూడదని అలాగే పాఠశాల చుట్టుపక్కల ఎవరైనా అపరిచితులు అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ బాల్కొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మొండి దినేష్, నాయకులు అభి,మహేశ్వర్,సంపత్,విష్ణు, సాయి,రాజు,శ్రీశాంత్,అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.