విద్యార్థులకు తల్లిదండ్రులే ఆదర్శం

– సెక్టోరియల్‌ అధికారి రజిని ఎంఈఓ గోపాల్‌
నవతెలంగాణ-నవాబుపేట్‌
విద్యార్థులకు తల్లిదండ్రులు ఆదర్శప్రాయంగా నిలవాలని సెక్టోరియల్‌ అధికారి రజిని ఎంఈఓ గోపాల్‌ అన్నారు. మండల పరిధిలోని ఎక్మామిడి లోని ప్రాథమిక పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్యఅతిథిగా సెక్టోరియల్‌ అధికారి రజని, మండల విద్యాధికారి గోపాల్‌ మాట్లాడుతూ..పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శప్రాయంగా నిలవాలని టీవీలకు సెల్‌ ఫోన్‌లకు ఇచ్చే సమయంలో కనీసం గంట సమ యం పిల్లల కోసం కేటాయించాలన్నారు. 10 నిమి షాలు పాఠశాలలో జరిగిన విషయాలపై చర్చిం చాలన్నారు. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్ల ల చదువు కోసం ఒక పక్క స్థలం కేటాయించాలని చదువుకునే వాతావరణం కల్పించాలని సూచిం చారు. ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు విద్యార్థుల అభివృద్ధిలో సహకరించాలని కోరారు. ఉపాధ్యాయు ల టీంవర్క్‌ బాగుందని కొనియాడారు. కార్యక్రమం లో గ్రామ సెక్రటరి శోభ, ప్రధానోపాధ్యాయులు అనంత పద్మనాభరావ్‌ ఉపాధ్యాయ బృందం గోపా ల్‌ రెడ్డి, విజయలక్ష్మి, రూతమ్మ, ఆఫ్రిన్‌ జహాన్‌ విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు.