నవతెలంగాణ – తుంగతుర్తి
మార్చి 3వ తేదీ ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమంలో అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు తల్లిదండ్రులు విధిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో నిర్మూలనకు సహకరించాలని తుంగతుర్తి ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ చింతమల్ల నిర్మల్ కుమార్ కోరారు. ఈ మేరకు శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంపై అవగాహన కల్పించి మాట్లాడారు. తుంగతుర్తి ఆరోగ్య కేంద్రం పరిధిలో 4 రూట్లలో,36 పోలియో చుక్కల కేంద్రాలలో, ఐదు సంవత్సరాలలోపు పిల్లల సంఖ్య 4374 గా గుర్తించి, పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సంచార జాతులు, ఇటుక బట్టీలు, ఇతర ప్రదేశాలలో ఉండే పిల్లలకు మొబైల్ టీం ద్వారా పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ఆదివారం జరిగే పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.3 వ తేదీ పోలియో చుక్కలు వేసుకోని పిల్లలకు,4,5 తేదీలలో ఇంటింటికి వెళ్లి వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ సముద్రాల సూరి, రవికుమార్, డీపీఎంఓ సురేష్,పి హెచ్ ఎన్ సైదమ్మ, హెచ్ వి జానకమ్మ, నవీన్, వేణుగోపాల్, హెల్త్ అసిస్టెంట్ గాజుల సోమన్న, యాదగిరి, నరసింహ చారి, ఏఎన్ఎంలు రజిత, భారతి, నాగలక్ష్మి, స్వాతి, జయమ్మ, స్వర్ణలత, కమల, మౌనిక, ఉమ, శైలజ, నాగమణి, స్వరూప, స్వప్న, రూప వివిధ గ్రామాల ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.