విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలి: రమణ దొండి

నవతెలంగాణ – ఆర్మూర్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్‌ పరీక్షా ఫలితాలు వచ్చినవి ,విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు రమణ దొండి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు .ఏ పరీక్షలోనైనా తమ పిల్లలకు మంచి మార్కులు వస్తే తల్లిదండ్రుల కంటే సంతోషించే వారు ఎవరూ ఉండరు. కానీ మార్కులు తక్కువ వస్తేనో, లేక ఫెయిలైతే..  పిల్లలు దిగులు పడటం, డిప్రెషన్లోకి పోవటం ఈ రోజుల్లో సహజమే. ఈ సమయంలో తల్లిదండ్రులుగా మీరందరూ ఆలోచించాల్సిన విషయా లు ఉన్నాయని అన్నారు. రిజల్ట్ వచ్చాక, మీ అబ్బాయి/ అమ్మాయి డల్‌గా ఉంటే, వారితో సమయం గడపాలని., వారిలో ధైర్యాన్ని నింపి. ఒక వారం రోజులు ఇలా చేస్తే, వారు దిగులు మరచి, మళ్లీ చదువుకు సిద్ధమైపోతారు. అంతే తప్ప, కటువుగా మాట్లాడకండి. కోపాన్ని ప్రదర్శించవద్దని అన్నారు.ఇంటికి వచ్చిన మీ బంధువులతో మీవాడి రిజల్ట్ గురించి చర్చ చేయకండి. ఒకవేళ వాళ్లు అడిగినా.. ‘ వాడి స్థాయికి బాగానే కష్టపడ్డాడు. ఫర్వాలేదు’ అని చెప్పి సరిపెట్టండి తప్ప వాళ్లముందు మీ పిల్లలను చిన్నబుచ్చటం చేయవద్దని సూచించారు.