నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల అంగన్ వాడి కేంద్రాలలో బాలికల దినోత్సవం సందర్భంగా బుధవారం టీచర్స్ కాలనీలో గల అంగన్వాడి కేంద్రంలో అలాగే ఇందిరా నగర్ కాలనీలో గల అంగన్వాడి కేంద్రాల్లో బాలికల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీడీపీఓ సునంద హాజరుకాగా ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు సంగీత కుశాల్ పాల్గొన్నారు. ఇద్దరు బాలికలు ఉన్న అమ్మలు, చెట్ల మొక్కలను పెట్టడం జరిగింది. సీడీపీఓ సునంద మాట్లాడుతూ.. బాలిక దినోత్సవం సందర్భంగా భేటీ పడావో భేటీ బచావో ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి. ఆడపిల్లలు పుడితే వారి అమ్మానాన్నలు ఎటువంటి బాధ పడొద్దని, ప్రతి ఆడబిడ్డకు చదువు నేర్పించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల కోసం పుట్టినప్పటి నుండి పెద్దగా అయ్యేవరకు చదువు పట్ల అన్ని రకాల వసతులు కల్పిస్తోందని, కాబట్టి ఈరోజు అన్ని అంగన్వాడి కాంద్రాలలో బాలికలు కలిగిన అమ్మలతో చెట్ల మొక్కలను పెట్టడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సంగీత కుశాల్, సీడీపీఓ సునంద, సూపర్వైజర్ కవిత, టీచర్లు కళావతి, చెంపబాయి, ఆయమ్మలు, పిల్లలు, పిల్లల తల్లులు, తదితరులు పాల్గొన్నారు.