మత్తు బారిన పడకుండా పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తుండాలి..

Parents should keep an eye on the children so that they don't get intoxicated.– వన్ టౌన్ సిఐ వాసుదేవరావు 
– పాన్ షాప్ లో తనిఖీలు 
నవతెలంగాణ – సిద్దిపేట 
గంజాయి, మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక కంటితో కనిపెట్టాలని వన్ టౌన్ సీఐ వాసుదేవరావు సూచించారు. గురువారం పట్టణంలో గంజాయి ఇతర మత్తుపదార్థాల నివారణ గురించి నార్కటిక్స్ డాగ్స్ అనుమానస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన    మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశానుసారం సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  మోయిన్ పుర,  గాంధీ రోడ్ తదితర అనుమానాస్పద ప్రదేశాలలో డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి నార్కోటిక్ డాగ్స్ తో  తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు  మరియు మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్స్ ఎవరైనా కలిగి ఉన్నా,  లేక అక్రమంగా రవాణా చేసిన పాన్ షాపులలో కానీ ఇతర షాపులలో అమ్మిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాన్ షాపులను తనిఖీ చేసినట్లు తెలిపారు. గంజాయి ఇతర మత్తుపదార్థాలు ఎవరైనా కలిగి ఉన్న,  విక్రయించిన  వెంటనే డయల్ 100,  తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1908, సిద్దిపేట వన్ టౌన్  పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాగ్ స్క్వాడ్ సిబ్బంది, సిద్దిపేట వన్ టౌన్  పోలీస్ స్టేషన్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.