
– ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తెరలతో బోధన
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాటశాలలు మెరుగు పడుతున్నాయి.గతంలో ప్రభుత్వ పాటశాలలు అంటే శిథిల భవనాలు,బోధన సరిగా ఉండదని,అసౌకర్యాలతో గదులు ఉంటాయనే భావన ఉండేది.దీంతో అందరూ ప్రయివేటు పాఠశాలలకు వెళ్ళడానికి మొగ్గు చూపేవారు. ప్రస్తుతం ఈ సిన్ మారిపోయింది.ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు అడుగులు వేస్తున్నారు.ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో కొన్నేళ్లుగా మంచి డిమాండ్ ఉంది.ప్రయివేటు పాఠశాలలకు చెందిన అనేకమంది విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్షలు మరి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు.
నాణ్యమైన విద్య బోధన..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావంతులైన ఉపాధ్యాయులు ఉండడంతో నాణ్యమైన విద్యానందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు.దీనికి తోడుగా ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు ఆధునిక విద్యాబోధనపై శిక్షణ అందింస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల మధ్య పోటీ..
కార్పోరేట్ పాఠశాల మాదిరిగా ప్రభుత్వ పాఠశాల మధ్య మరింత పోటీతత్వం పెరిగింది. దీంతో మంచి ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు.దాని కారణంగా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి వారివారి సబ్జెక్టుల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించే విధంగా ఉపాధ్యాయులు విద్య బోధన చేస్తూ 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు.అందులో భాగంగానే ఈ ఏడాది మండలంలోని తాడిచెర్ల, మల్లారం,పెద్దతూoడ్ల,వళ్లెంకుంట జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లో,దుబ్బపేట గ్రామంలోని కాస్టూబ్బా గాంధీ ఆశ్రమ పాఠశాల,ఎడ్లపల్లి గ్రామంలోని మోడల్ స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత సాధించారు.
పాఠశాలల్లో డిజిటల్ తరగతులు..
పాలకుల ప్రత్యేక శ్రద్ధ,స్థానిక ప్రజాప్రతినిధుల కృషితో నేడు ప్రభుత్వ పాఠశాలల భవనాలను కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ నిధులు,దాతల సహకారంతో ఆధునిక భవనాలను నిర్మించారు.అందులో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు విద్యార్థులకు మరింత ఆధునిక విద్య అందించాలన్న లక్ష్యంతో ఆధునిక డిజిటల్ తెరలు, గ్రీన్ బోర్డ్ ఏర్పాటు చేసి బోదిస్తున్నారు.
మంచి ఫలితాలు సాధిస్తున్నాం..మల్కా భాస్కర్ రావు, తాడిచెర్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు
ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణతను సాధిస్తున్నాం.నాణ్యమైన విద్య బోధన చేసి మంచి ఫలితాలు రాబడుతున్నాం.ప్రయివేటు పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.అందుకు అనుగుణంగానే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాం.