పార్క్‌ పనులను వేగవంతం చేయాలి

– చైర్‌ పర్స న్‌ నాగపూర్ణ
నవతెలంగాణ-గండిపేట్‌
నార్సింగ్‌ మున్సిపాలిటీలోని పార్క్‌ పనులను వేగవంతం చేయాలని చైర్‌ పర్సన్‌ నాగపూర్ణ అన్నారు. శుక్రవారం కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి నార్సిం గ్‌ లోని అరుణోదయ కాలనీలోని పార్కును పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. పనులను వేగవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ లక్ష్మీ ప్రవళిక, ఇంజనీరింగ్‌ సెక్షన్‌ విభాగం వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు శేఖర్‌, అనిల్‌, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.