
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం భువనగిరి బస్టాండు (ప్రభుత్వ జూనియర్ కళాశాల) మూలమలుపు నుంచి జగదేకపూర్ చౌరస్తా వరకు అత్యంత రద్దీగా ఉంటుంది. రోజు సాయంత్రం వేళలో కారు ఇతర వాహనాలు రోడ్డుపైన నిలపడంతో ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులకు హెల్మెట్ లేదని, లైసెన్స్ లేదని , జరిమానా విధించే ట్రాఫిక్ పోలీసులు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న రోడ్డుపై వాహనాలు నిలిపిన పట్టించుకోకపోవడంపై వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎస్బిహెచ్ ఉన్న (స్మార్ట్ సూపర్ స్టోర్ ) ప్రిన్స్ కార్నర్ మధ్యలో ప్రతిరోజు రోడ్డుపైన వాహనాలు నిలపడంతో హైదరాబాద్ కి వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై ట్రాఫిక్ పోలీసులు సృష్టి సాధించి ట్రాఫిక్ క్లియర్ చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు .