డిసెంబర్‌ 4 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

Parliament sittings from December 4న్యూఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 4 నుంచి ప్రారంభంకానున్నాయి. 4 నుంచి 22 వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి గురువారం వెల్లడించారు. పార్లమెంట్‌ వ్యవహారాలు, ఇతర అంశాలపై అమృత్‌కాల్‌లో ముందుకుసాగనున్నట్టు తెలిపారు. కాగా ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌లను మారుస్తూ ప్రతిపాదించిన బిల్లులపై సమావేశాల్లో చర్చ జరుగవచ్చునని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవలే ఈ మూడు నివేదికలను హౌం శాఖ స్టాండింగ్‌ కమిటీ ఆమోదించింది. ఎన్నికల కమిషనర్ల బిల్లు కూడా ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నది. అలాగే ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లపై నిఘా అంశం చర్చనీయాంశం కానుంది.