– చేవెళ్ల పోరులో తాండూర్ రాజకీయం
– కాంగ్రెస్ నుంచి సునీతారెడ్డికి దాదాపు ఖరారు
– బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..?
– బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీకే అవకాశం
పార్లమెంట్ ఎన్నికల పోరు హీట్ పుట్టిస్తోంది. అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో నాయకులు తమదైన శైలిలో ఎన్నికల బరిలో ఉండేందుకు మంత నాలు జరుపుతున్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి దంప తులు కాంగ్రెస్‌లో చేరడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణమాలు మారాయి. పట్నం దంపతులకు తాండూర్‌పై మంచి పట్టు ఉండడంతో చేవెళ్ల పార్లమెంట్‌పై తాండూర్ రాజకీయాలు ప్రభావం చూపుతున్నాయి.
నవతెలంగాణ-తాండూరు
ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి ఇటీవలె బీఆర్‌ఎస్ నుంచి కాం గ్రెస్‌లో చేరారు. గతంలో బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డిని గెలిపించేందుకు పట్నం దంపతులు పూర్తి స్థాయిలో పనిచే శారు. ఇప్పుడు సునీతారెడ్డి కాంగ్రెస్ నుంచి చేవెళ్ల పార్ల మెంట్ బరిలో ఉండేందుకు సిద్ధం అవుతు న్నారు. చేవెళ్ల కాంగ్రెస్ టికెట్ సునీతారెడ్డికే వస్తుందని స్థానికంగా జోరు గా ప్రచారం సాగుతోంది. తాండూరులో బీఆర్‌ఎస్‌లో చేరి న వివిధ పార్టీల నాయకులు వ్యక్తిగత లాభాలు ఎదుటి వా రిపై ఉన్న కోపంతో పార్టీలు మారినా నాయకలు ప్రజలను ఓటర్లను ప్రభావితం చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నా యి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాలు, గ్రా మాలపై సునీతామహేందర్‌రెడ్డికి మంచి పట్టుందని పలు వురు అభిప్రాయడుతున్నారు. ఇక బీజేపీ నుంచి మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి టికెట్ దక్కేలా ఉంది. ఇప్పటికే ఆయన గ్రౌం డ్ లెవల్‌లో వర్క్ స్టార్ట్ చేశారు. ఇటీవల తాండూర్ నుంచే విజయ సంకల్ప యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమా నికి కేంద్ర మంత్రితోపాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజరు కూడా హాజరై యాత్ర ప్రా రంభించారు. పార్టీ బలోపేతం, ఎన్నికల్లో పోటీపై కసరత్తు చేస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్ టికెట్ సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డికేనని పార్టీ అధిష్టానం గతంలోనే ప్రకటించింది. ఎన్నికల సన్నా హాక సమావేశాలు సైతం పార్టీ నిర్వహించింది. ఈ సమా వేశాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజర య్యా రు. సిట్టింగ్ స్థానంలో మళ్లీ పాగా వేసేందుకు బీఆర్‌ఎస్ వ్యూహాత్మక కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు లేకపో వడంతో మాజీ ఎమ్మెల్యే సహకారంతో ప్రజల్లోకి వెళ్తోంది. సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తూ మళ్లీ పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఏదిఏమైనా అన్నీ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాయి.