దేశ విద్యారంగ పరిరక్షణకై జనవరి 12న చలో పార్లమెంట్..

నవతెలంగాణ- చివ్వేంల
దేశంలో విద్యారంగ పరిరక్షణకు విద్యారంగాన్ని కాపాడాలని నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అందరికీ విద్య ఉపాధి కల్పించాలని జాతీయ స్థాయి మెడికల్ టెస్ట్ నీట్ రద్దు చేయాలని జనవరి 12న దేశవ్యాప్తంగా 16 విద్యార్థి సంఘాలను కలుపుకొని చలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బానోతు వినోద్ కుమార్ అన్నారు. చివ్వేంల మండలం ఎస్ఎఫ్ఐ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. పసివయసులోనే విద్యార్థుల పాఠ్యపుస్తకాలు మతోన్మాద భావజాలాలను జోప్పిస్తూ విద్యారంగాన్ని కాషాయకరణ చేస్తున్నారని విద్యార్థుల పాఠ్యపుస్తకాలలో జాతీయ ఉద్యమ నాయకుల చరిత్రను తొలగించి జాతీయ ఉద్యమంతో సంబంధంలేని గాడ్సే, వీడి సావర్కర్ చరిత్రలను పొందపరుస్తున్నారని, జ్యోతిష్యం వాస్తు వంటి ఆశాస్త్రీయ భావజాలాలని విద్యార్థుల మెదడులో ఎక్కిస్తూ మొద్దు పరుస్తున్నారని తెలిపారు. ఎన్ ఎన్ టి ఏ వంటి సంస్థలను రద్దు చేయాలని జాతీయస్థాయి పోటీ పరీక్షలను ఈ సంస్థ ద్వారా నిర్మించడం ద్వారా విపరీత అధికార కేంద్రీకృతమై విద్యార్థులకు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. దేశంలోని కేంద్ర  విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాలు కల్పనకు కనీసం నిధులు కేటాయించడం లేదని నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా బహుళ జాతి కంపెనీ ప్రైవేట్ యూనివర్సిటీలను ఆహ్వానిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలను నీరు కార్చే కుట్ర చేస్తుందన్నారు. అలాగే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం విద్యార్థుల ఆకాంక్షలు నెరవేర్చాలని రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 7800 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 7800 కోట్ల  రూపాయలు ఉన్నాయని సంక్షేమహాస్టల్ కు డైట్ బిల్లులు సకాలంలో ఇవ్వాలని రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీకి సరిపడా నిధులు కేటాయించాలని ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నూతన ప్రభుత్వం విద్యార్థుల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగానే నియంత్రిత్వ పోకడలకు పోతే విద్యార్థులు సరైన రీతిలో స్పందించి తీరుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ  నాయకులు నాగ, మనోహర్, శ్రీను, సుమన్, విగ్నేష్, గోపి, అభి, ప్రేమ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.