నవతెలంగాణ – హైదరాబాద్: నికాన్ కార్పొరేషన్ యొక్క 100% అనుబంధ సంస్థ అయిన నికాన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Z6IIIని ఈరోజు బేగంపేట్‌లోని వివాంతా హోటల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పరిచయం చేసింది. పూర్తి – ఫ్రేమ్ మిర్రర్‌లెస్ కెమెరా పోర్ట్‌ఫోలియో పట్ల తన నిబద్ధతను పునరుద్గాటించిన నికాన్ ఇండియా, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ యొక్క కళను దీని ద్వారా పునర్నిర్వచించటానికి సిద్దమైనది. Z9 మరియు Z8 మోడల్‌ల నుండి అత్యున్నత ఫీచర్లు అయిన ఇన్-కెమెరా RAW మరియు N-Log వీడియోలు, EXPEED 7 ప్రాసెసర్ సహా అధిక-పనితీరు మరియు పరిశ్రమ ప్రముఖ స్పెసిఫికేషన్‌లను అందిస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా పార్షియల్లి స్టాక్డ్ CMOS సెన్సార్, అసాధారణమైన పనితీరు కోసం అత్యుత్తమ ఆటో ఫోకస్ సామర్థ్యాన్ని Z6III కలిగి ఉంది. మెరుగైన పనితీరు అందించటానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సజ్జన్ కుమార్ మాట్లాడుతూ, ” అత్యున్నతమైన Z8 మరియు Z9 మోడల్‌లు నుండి ఆవిష్కరణల స్ఫూర్తిని వారసత్వంగా పొందే అధిక-పనితీరు గల ఫుల్-ఫ్రేమ్ మిడ్-సెగ్మెంట్ కెమెరా Z6IIIని పరిచయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అసాధారణమైన ఫీచర్‌లు మరియు అసమానమైన పనితీరుతో, ఈ కాంపాక్ట్ సైజ్ ప్రొఫెషనల్ కెమెరా ప్రపంచంలోనే మొట్టమొదటి పార్షియల్లి స్టాక్డ్ సెన్సార్‌ని కలిగి ఉంది. ఇమేజింగ్ టెక్నాలజీలో అత్యుత్తమ ఆవిష్కరణలలో ఒకటిగా ఇది నిలుస్తుంది. అదనంగా, మేము 5.7M అద్భుతమైన రిజల్యూషన్‌తో పరిశ్రమలో మొట్టమొదటి ప్రకాశవంతమైన ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ (EVF)ని కూడా పరిచయం చేసాము. ఈ కెమెరా గరిష్టంగా 6K/60p వరకూ ఉన్నతమైన వీడియో రిజల్యూషన్, పూర్తి HD 240p లతో పాటుగా అధిక-నాణ్యత వీడియో ఉత్పత్తి కోసం అంతర్నిర్మిత N-Log, N-RAW మద్దతును అందిస్తుంది. కొత్త నికాన్ Z6lll దాని ఆటో ఫోకస్ ఖచ్చితత్వం మరియు అత్యంత -వేగవంతమైన 120fps ప్రీ-రిలీజ్ క్యాప్చర్, ఆకట్టుకునే 20fps నిరంతర షూటింగ్ రేట్‌తో అద్భుతమైన క్షణాలను స్తంభింపజేయగల సామర్థ్యంతో క్రియేటర్ కమ్యూనిటీకి ఒక సమగ్ర సాధనంగా మారుతుంది..” అని అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు కొత్త నికాన్ Z6IIIతో సమగ్ర అనుభవాన్ని పొందారు. ఈ కార్యక్రమం వారికి వివాహ, ఫ్యాషన్ మరియు యాక్షన్ జానర్‌లను తగినట్టు గా లైవ్ ఎక్స్‌పీరియన్స్ జోన్‌లను ఏర్పాటు చేయటం వల్ల పలు అంశాలపై దృష్టి సారిస్తూ ఉత్పత్తి యొక్క లక్షణాలను మరింత అన్వేషించడానికి మరియు ఉత్పత్తిని తమదైన రీతిలో పరీక్షించటానికి పాల్గొన్న వారికి అవకాశం కల్పించింది. అద్భుతమైన, మెరుపు-వేగవంతమైన EXPEED 7 ప్రాసెసింగ్ ఇంజిన్ కలిగిన నికాన్ Z6III మీకు ఖచ్చితత్వంతో మరియు స్పష్టతతో కూడిన మరుపురాని క్షణాలను ఒడిసిపట్టడానికి తగిన శక్తినిస్తుంది. నికాన్ యొక్క టాప్-టైర్ మోడల్స్ నుండి అత్యుత్తమ పనితీరు మరియు కార్యాచరణను వారసత్వంగా పొందడం వల్ల Z6III తక్కువ-కాంతి పరిస్థితులు మరియు బ్యాక్‌లైట్ దృశ్యాలలో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇది గరిష్టంగా 9 సబ్జెక్ట్ రకాలను గుర్తించగలదు మరియు మెరుగైన ఆటో ఫోకస్ పనితీరును అందించడమే కాకుండా AF ఖచ్చితత్వాన్ని దాని పూర్వీకుల కంటే మెరుగ్గా తీసుకుంటుంది. అత్యుత్తమ తక్కువ-కాంతి పనితీరు మరియు మీ సృజనాత్మక శక్తిని విస్తరించే ఉత్తేజకరమైన కొత్త ఫంక్షన్‌లతో, సరిహద్దులను అధిగమించడానికి మరియు అద్భుతమైన విజువల్స్‌తో తమ కథలను చెప్పడానికి సిద్ధంగా ఉన్న ఫోటోగ్రాఫర్‌లు మరియు వీడియోగ్రాఫర్‌లకు Z6lll సరైన భాగస్వామి.
లభ్యత
నికాన్ Z6lll కెమెరా బాడీ 25″ జూన్ 2024 నుండి భారతదేశం అంతటా రూ. 2,47,990/- (బాడీ మాత్రమే) లో నికాన్ అవుట్‌లెట్‌లలో లభిస్తుంది. Z6lll రూ. 27,000 విలువైన ప్రత్యేక పరిచయ ఆఫర్‌ను అందిస్తుంది. ఇందులో Angelbird AV PRO CFexpress B SE 512 GB లేదా SX 160 GB కార్డ్, అదనపు బ్యాటరీ మరియు ఛార్జర్ ఉన్నాయి. ఆస్ట్రియా-కేంద్రంగా కలిగిన ఏంజెల్‌బర్డ్ కెమెరా-నిర్దిష్ట మీడియా కార్డ్‌లు మరియు స్టోరేజ్ సొల్యూషన్‌లను ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకునేలా రూపొందించింది, అందువల్ల క్రీయేటర్స్ తమ లక్ష్యం ను విశ్వాసంతో సాధించడానికి తగిన నమ్మకం అందిస్తుంది. భారతదేశంలో ఏంజెల్‌బర్డ్ మీడియా కోసం ప్రత్యేకమైన పంపిణీదారుగా సృష్టి డిజిలైఫ్ వ్యవహరిస్తుంది, వారి అత్యాధునిక పరిష్కారాలను పొందే అవకాశం అందిస్తోంది. కొత్త Z6III మరియు ఇతర నికాన్ ఉత్పత్తులపై మరింత సమాచారం కోసం, దయచేసి https://www.nikon.co.inని సందర్శించండి