శతావధానంలో పాల్గొనడం హర్షించదగ్గ విషయం..

నవతెలంగాణ-తొగుట : శతావధానంలో పాల్గొనడం హర్షించదగ్గ విషయ మని బండకాడి అంజయ్య గౌడ్ అన్నారు.సోమ వారం ఆయన నవతెలంగాణ మాట్లాడుతూ హైదరాబాద్ లోని దర్శనమ్ మాసపత్రిక యాజ మాన్యం శ్రీ మరుమాముల దత్తాత్రేయశర్మ, వేంకట రమణశర్మ ఆద్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్ లో త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్  శతావధానంలో ఆదివారం పాల్గొన్నమని తెలిపారు. ఇందులో భాగంగా ఒక సెషన్స్ కు అధ్యక్షుడు గాను, సమస్యా ప్రాశ్నికుని పాల్గొన్నందుకు సత్కారించారని అన్నారు.రాష్ట్ర ఆవిర్భావం అనంతరం నూతనంగా ఏర్పాడిన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావు పేట గ్రామంలో జన్మించడం నాకు సంతోకరంగా ఉందన్నారు.బండకాడి బాగమ్మ నర్సాగౌడ్ ప్రథమ సంతనగా జన్మించి ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొ నడం చాలా గొప్ప విషయం అన్నారు.ఇలాంటి విజయాలు సాధించడం నాకు మరింత సంతోషం గా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.