పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కండి: హ్యాపీ వాకర్స్ అసోసియేషన్

నవతెలంగాణ – ఆర్మూర్
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములై మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో హ్యాపీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆదివారం మొక్కలను నాటినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లింబాద్రి గౌడ్ ,జి జి రామ్, పుష్పాకరావు, కామణి నరేష్, రాజేందర్ , శ్రీనివాస బాలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.