నవతెలంగాణ-హైదరాబాద్ : ఫోరమ్ ఫర్ ఇంటర్నెట్ రిటైలర్స్, సెల్లర్స్ & ట్రేడర్స్ (FIRST India) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)కి చెందిన ముఖ్య అధికారులతో స్టేక్ హోల్డర్ రౌండ్ టేబుల్‌ని నిర్వహించింది. అంతర్జాతీయ వాణిజ్యం లో భారతీయ ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్ల పరిష్కారానికి 100కి పైగా ఎక్స్ పోర్ట్ హబ్స్ ను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది. సరిహద్దు చెల్లింపు సమస్యలు, సంక్లిష్టమైన కస్టమ్స్ విధానాలు, ఆంక్షలతో కూడిన ఎగుమతి విధానాలు ప్రపంచ విస్తరణకు ప్రధాన అడ్డంకులుగా మారాయనే అంశాన్ని ఈ చర్చ ప్రముఖంగా తెరపైకి తీసుకువచ్చింది.
ప్రక్రియలను క్రమబద్ధీకరించడం ద్వారా, అంతర్జాతీయ మార్కెట్‌లను మరింత సమర్ధవంతంగా నావిగేట్ చేయడానికి విక్రేత లకు వీలు కల్పించడం ద్వారా ఇ-కామర్స్ ఎక్స్‌పోర్ట్ హబ్‌ల (ఇసిఇహెచ్‌లు) స్థాపనను వేగంగా ట్రాక్ చేయడం అనేది భారతీయ ఎంఎస్ఎంఈల అంతర్జాతీయ ఆకాంక్షలకు మద్దతు ఇస్తుందని చర్చలో పాల్గొన్నవారు అంగీకరించారు.
100 ఎక్స్ పోర్ట్ హబ్స్ నెలకొల్పే లక్ష్యాన్ని నిర్దేశించడం, మొత్తం ఎగుమతులలో దేశం యొక్క భారీ లక్ష్యమైన 1 ట్రిలియన్ డాలర్ ఎగుమతులకు దోహదపడాలనే అవసరాన్ని ఈ సమావేశం పునరుద్ఘాటించింది. ప్రస్తుతం వాణిజ్య ఎగుమతులు కేవలం 4-5 బిలియన్ల డాలర్లుగా మాత్రమే ఉన్నాయి. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ మొత్తం సరుకుల ఎగుమతులలో కేవలం 0.9%-1.1% మాత్రమే. ఇ-కామర్స్ ఎగుమతులలో ప్రభుత్వం నిర్దేశించుకున్న 200-300 బిలి యన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి, ప్రస్తుత ఎగుమతి స్థాయిలను 50 నుండి 60 రెట్లు చేయవలసిన అవసరాన్ని చర్చలో పాల్గొన్న వారు నొక్కి చెప్పారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ డీజీఎఫ్టీ శ్రీ మోయిన్ అఫాక్ మాట్లాడుతూ, ‘‘ఎగుమతుల ప్రోత్సాహానికి గాను సహకారాన్ని పెంపొందించడానికి, మొత్తం వాణిజ్య పర్యావరణ వ్యవస్థ ప్రయోజనం కోసం, సామర్థ్య పెంపుదల, నైపుణ్య అభివృద్ధి కోసం పారదర్శక, యాక్సెస్ చేయగల వ్యవస్థలను స్థాపించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) కట్టుబడి ఉంది. ట్రేడ్ కనెక్ట్ పోర్టల్, ఎగ్జిమ్ పాఠశాల వంటి కార్యక్రమాలు వాటాదారులకు సాధికారత, అవగాహన కల్పించడానికి రూపొందిం చబడ్డాయి. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, ప్యాకేజింగ్, లేబులింగ్‌తో సహా కీలకమైన అంశాలపై విద్యాపరమైన కంటెంట్‌ను అభి వృద్ధి చేయడంలో మాతో సహకరించడానికి, దేశవ్యాప్త విస్తరణను విస్తరించడానికి, అర్ధవంతమైన ప్రభావాన్ని సృష్టించ డానికి పరిశ్రమకు చెందిన ప్రముఖ సంస్థలను మేం ఆహ్వానిస్తున్నాం. చక్కటి వర్క్‌షాప్‌ని నిర్వహించినందుకు ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్‌కి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇ-కామర్స్ ఎగుమతులు, ప్రోత్సాహకాలు, సాంకేతిక జోక్యాల కోసం సామర్థ్యాల నిర్మాణంపై ఇక్కడ పంచుకున్న తెలివైన ఆలోచనలు అమూల్యమైనవి. మన విదేశీ ఇ-కామర్స్ సామర్థ్యాలను మరింత మెరుగుపరచడానికి ఈ భావనలను అన్వేషించడానికి మేం ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.
ఫస్ట్ ఇండియా ట్రస్టీ, ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ గౌరవాధ్యక్షులు శ్రీ వినోద్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఈ-కామర్స్ అనేది గ్లోబల్ మార్కెట్‌లను చేరుకునేందుకు ఎంఎస్ఎంఈలకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. 2030 నాటికి భారతదేశం 200 బిలియన్ అమెరికన్ డాలర్ల క్రాస్ బోర్డర్ ఎగుమతి లక్ష్యాన్ని సులభంగా దాటగలదని మేం విశ్వ సిస్తున్నాం. అయితే మనం ప్రస్తుతం వృద్ధికి ఆటంకం కలిగించే విధంగా చెల్లింపులు, కస్టమ్స్ చుట్టూరా ఉన్న సవాళ్ల ను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇ-కామర్స్ ఎక్స్‌పోర్ట్ హబ్‌ల వంటి కార్యక్రమాల ద్వారా, ప్రపంచ వాణిజ్యంలో వృద్ధి చెందడానికి ఎంఎస్ఎంఈలకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి మేం ప్రభుత్వం, భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం’’ అని అన్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, ఇ-కామర్స్ ఎగుమతులను క్రమబద్ధీకరించడానికి, పెంచడానికి, ముఖ్యంగా ఎంఎస్ఎంఈల కోసం ఈ-కామర్స్ ఎక్స్ పోర్ట్ హబ్‌లను (ECEHs) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చొరవ విదేశీ లావాదేవీలను సరళీకృతం చేయడం, కాంప్లియెన్స్ భారాలను తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్‌లలో వృద్ధిని పెంచడం ద్వారా కీలక సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) “డిస్ట్రిక్ట్ యాజ్ ఎక్స్‌పోర్ట్ హబ్స్” కార్యక్రమం ద్వారా ఎంఎస్ఎంఈ ఎగుమతు లను పెంచడానికి అమెజాన్, డీహెచ్ఎల్ వంటి ప్లాట్‌ఫామ్‌లతో సహకరిస్తోంది. ఇటీవలి నెలల్లో డీజీఎఫ్టీ 76 జిల్లాల్లో ఎంఎస్ఎంఈలకు శిక్షణ ఇవ్వడానికి డీహెచ్ఎల్ తో మరియు 20 జిల్లాల్లో ఎగుమతి శిక్షణను అందించడానికి అమెజాన్‌తో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. లాజిస్టిక్స్ సంస్థ షిప్ రాకెట్ కూడా 16 జిల్లాల్లో కెపాసిటీ-బిల్డింగ్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేయడానికి డీజీఎఫ్టీతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ భాగస్వామ్యాలు భారతీయ ఎంఎస్ఎంఈ లను ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉండేలా చేసేందుకు సామర్థ్యం పెంపుదల మరియు వర్క్‌షాప్‌లపై దృష్టి సారించాయి.
ముఖ్య సిఫార్సులు:
- చెల్లింపుపై 25% వ్యత్యాస పరిమితి:
o 25% కంటే తక్కువగా తగ్గించబడిన చెల్లింపులను తక్షణమే పరిష్కరించినట్లు బ్యాంకులు పరిగణించాలి.
o 25% కంటే ఎక్కువ తగ్గింపులకు సంబంధించి వ్యత్యాసాన్ని సమర్థిస్తూ ఎగుమతిదారులు అందించే పత్రాల ఆధారంగా బ్యాంకులు తప్పనిసరిగా రైట్-ఆఫ్ ప్రక్రియను అనుసరించాలి. ఈ ప్రక్రియ త్రైమాసికం లేదా ఆరు నెలలకోసారి సమీక్షించబడాలి.
- పేమెంట్ రియలైజేషన్ కోసం అనుమతించబడిన సమయం:
ఇ-కామర్స్ ఎగుమతిదారులకు పేమెంట్ రియలైజేషన్, డాక్యుమెంట్ సమర్పణ కోసం 9 నెలల వ్యవధి ఇవ్వాలి.
- అగ్రిగేట్ రికన్సిలియేషన్ మోడల్:
అధిక-పరిమాణం కలిగిన పరిశ్రమలకు సంబంధించి కాంప్లియెన్స్ భారాలు, సమయం, ఖర్చులను ఆదా చేయడానికి, రికన్సిలియేషన్ మోడల్ వార్షికం లేదా అర్ధ వార్షికంగా ఉండాలి.
o ఇప్పటికే బకాయి ఉన్న షిప్పింగ్ బిల్లులకు సంబంధించి 25% వ్యత్యాస పరిమితి లేకుండా త్రైమాసిక రికన్సిలియేషన్ మోడల్ ను అనుమతించాలి.
- ఇ-కామర్స్ ఎక్స్ పోర్ట్ పాలసీ ఫ్రేమ్‌వర్క్:
చిన్న-విలువ బిల్లుల కోసం నిబంధనలను సరళీకృతం చేయాలి, నేరుగా EDPMSకి నివేదించాలి.
o పాలసీలు రీ-ఇంపోర్ట్ ప్రక్రియను సులభతరం చేయాలి, తిరిగి వచ్చిన వస్తువులను సుంకాల నుండి మిన హాయించాలి. భారతదేశంలో తిరిగి ప్రవేశించే వస్తువులకు రిఫండ్స్ ను అందించాలి, చిన్న అమ్మకందారు లకు ఆర్థిక భారాన్ని తగ్గించాలి.
ఫస్ట్ ఇండియా గురించి
ఫస్ట్ ఇండియా (ఫోరమ్ ఫర్ ఇంటర్నెట్ రిటైలర్స్, సెల్లర్స్ అండ్ ట్రేడర్స్ ఆఫ్ ఇండియా) అనేది ISF యొక్క ప్రత్యేక ప్రయో జన విభాగం. MSMED 2006లోని సెక్షన్ 7లోని సబ్ సెక్షన్ (2) కింద ఏర్పాటైన అడ్వైజరీ కమిటీ సలహాపై ఎంఎస్ఎంఈడీ చట్టం 2006 కింద సూక్ష్మ చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్ నిర్వచనంలో చేర్చబడిన రిటైలర్లు, విక్రేతలు, వ్యాపారుల ప్రవేశానికి మద్దతుగా ఏర్పడింది.
ఎంఎస్ఎంఈ మాజీ మంత్రి నారాయణ్ రాణే ప్రారంభించిన ఫస్ట్ ఇండియా 42,000 కంటే ఎక్కువ మంది విక్రేతలకు ప్రాతి నిధ్యం వహిస్తుంది. భారతీయ వ్యాపారులు తమ వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లో, జాతీయంగా, సరిహద్దులకు వెలుపలా విస్త రించడానికి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని అడ్డంకులను తొల గించడానికి, కాంప్లియెన్స్ ను తగ్గించడానికి, ప్రపంచ మార్కెట్‌లకు ప్రాప్యతను అందించేందుకు భారతీయ విధాన నిర్ణేత లతో కలసి పని చేస్తుంది.
ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ గురించి:
ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ (ISF) భారతదేశంలో చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు సంబంధించి అతిపెద్ద లాభాపేక్ష రహిత, రాజకీయేతర, ప్రభుత్వేతర & వాణిజ్యేతర సంస్థ. 9400+ మహిళా పారిశ్రామికవేత్తలతో సహా 98,200 కంటే ఎక్కువ MSMEలు చెల్లింపు సభ్యులుగా ఉన్నారు. 12,36,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్ర శాఖలు న్నాయి. మా ప్రొఫెషనల్ అనుబంధంలో MSME మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, FIDD RBI, UNIDO, UNCTAD, ఐటీసీ జెనీవా, WUSME, INSME & SMEలకు సంబంధించి WTO యొక్క అనధికారిక సమూహం ఉన్నాయి.