పార్టీ శ్రేణులు ఎంతో శ్రమించి పని చేశారు

– కార్పొరేటర్‌ రావుల శేషగిరి
– బీజేపీ శ్రేణులకు కతజ్ఞతలు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజిగిరి కోటపై బీజేపీ జెండా ఎగరడం తధ్యమని ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సష్టించబో తున్నాడని గాజులరామారం డివిజన్‌ కార్పొరేటర్‌, గ్రేటర్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు రావుల శేషగిరి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం గాజులరామారం డివిజన్‌ గాజుల రామారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తారీకున జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్‌ ఎన్నికలలో డివిజన్‌ పార్టీ శ్రేణులు నాయకులందరూ ఎంతో శ్రమించి సమర్ధవంతగా పని చేశారని ఫలితం జూన్‌ 4న వస్తుందని సంబరాలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తల్లో భరోసానింపారు.ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ కార్యకర్తలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.పార్టీ బలోపేతానికి కంకణ బద్దలై పనిచేస్తున్న శ్రేణులకు కతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షులు సాయినాథ్‌ నేత, రాష్ట్ర యువమోర్చా మీడియా కన్వీనర్‌ రేవతి రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్‌ పాటిల్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శిలు జ్ఞాని ఈశ్వర్‌, సీనియర్‌ నాయకులు సింగారం మల్లేష్‌, ప్రభాకర్‌ రెడ్డి, మురళి, డివిజన్‌ నాయకులు, బూత్‌ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.