వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి పార్టీ షోకాజ్ నోటీస్ 

నవతెలంగాణ – రామారెడ్డి 
కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి గురువారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి షోకాజ్ నోటీసు జారీచేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్రావుపై అసత్యపు ఆరోపణలు, కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలుపై వ్యతిరేకంగా మాట్లాడినందుకు నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు.