
నవతెలంగాణ -పెద్దవూర
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం హాలియ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం శ్రీ శ్రీ శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి శిలా ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మరియు పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలకు కమిటీ వారి ఆహ్వానం మేరకు బుసిరెడ్డి పౌండేశన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేవస్థాన కమిటీ సభ్యులను బుసిరెడ్డి పాండురంగారెడ్డిని ఘనంగా సన్మానం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంచేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మరియు ట్రస్ట్ ఛైర్మన్ పిట్టల శంకర్, అధ్యక్షులు ముజ్జ శ్రీహరి, దేవస్థాన అధ్యక్షులు చెరుపల్లి ముత్యాలు, ఉపాధ్యక్షులు శేఖర్ రాజు, సైదులు, కార్యదర్శులు జంపాల అనంతయ్య, కార్యవర్గ సభ్యులు పల్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి, తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, మాజీ పెద్దవూర సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.