
నవతెలంగాణ – గోవిందరావుపేట
మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పడిగ పార్వతి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. గురువారం మండలంలోని కాకర్ల మడత గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ. పార్వతి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్వతి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సేవలు చేసిందని, కాంగ్రెస్ పార్టీ మంచి నాయకురాలిని కోల్పోయిందని, వారి కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ సీతక్క ఉంటారని అన్నారు. అలాగే మృతురాలు పార్వతి కుటుంబాలనికీ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రేగ కళ్యాణి, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, ములుగు మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా, మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, కనతల నాగేందర్ రావు, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి సూదిరెడ్డి జనార్ధన్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, మహిళా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు సునీత తదితర నాయకులు పాల్గొన్నారు.