ప్రశాంతంగా పార్వతి తనయుడి శోభాయాత్ర

Parvati's son's procession is peacefulనవతెలంగాణ – లోకేశ్వరం
మండలంలోని ఆయా గ్రామాల్లో  గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరుగింది. తొమ్మిది రోజులు పూజలు అందుకున్న వినాయకుడిని పలు కాలనీలలో ప్రతిష్టించిన గణేష్ మండపాల నిర్వాహకులు ఆదివారం వీడ్కోలు పలికారు. పార్వతి తనయుడిని వాహనాల్లో ప్రతిష్టించి గ్రామాల్లోని ప్రధాన  వీదుల గుండా డిజె , బ్యాండ్, బాజా భజంత్రీలు  చప్పుడు మధ్య యువకులు, మహిళలు నృత్యాలు చేస్తూ ప్రదాన వీదుల  గుండా ఊరేగింపు జరిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలిసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.