
రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగా శుక్రవారం మండలం లోని గోవిందరవుపేట, చల్వాయి ,సోమలగడ్డ, మచ్చపూర్, బుస్సాపూర్ గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో సీఐ శంకర్ మరియు ఎస్ఐ షేక్ మస్తాన్ లు పరిశీలించడం జరిగింది.ఈ క్రమంలో ఆ పోలింగ్ సెంటర్స్ లో గతం లో జరిగిన ఎన్నికల గురించి అడిగి తెలుసుకోవటం జరిగింది. ఈ సందర్భం లో సిఐ శంకర్ మరియు ఎస్సై మస్తాన్ లు మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, ఎలాంటి భయ భ్రాంతులకు,ప్రలోభాలకు గురికాకుండా వినియోగించుకోవాలని ,ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణం లో వేయడానికి వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లను పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తుందని తెలియచేసారు. ఇలాంటి సంఘటనలు తదితన తమకు వెంటనే సమాచారం అందించాలని కోరారు.