పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పసర ఎస్ ఐ కమలాకర్

నవతెలంగాణ- గోవిందరావుపేట
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగా మంగళవారం మండలంలోని గోవిందరవుపేట, దుంపెల్లిగూడెం,రాం నగర్,కోటగడ్డ  గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను ఎస్ఐ కమలాకర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలో ఆయా పోలింగ్ సెంటర్స్ లో గతంలో జరిగిన ఎన్నికల గురించి అడిగి తెలుసుకోవటం జరిగింది. ఈ సందర్భంలో ఎస్ ఐ మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, ఎలాంటి భయ భ్రాంతులకు, ప్రలోభాలకు గురికాకుండా వినియోగించుకోవాలని, ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణం లో వేయడానికి వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లను పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తుందని తెలియచేసారు.