నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలో సంక్రాంతి పండుగకి ఊరు వదిలి వేరే గ్రామాలకు వెళ్ళేవారు తగు జాగ్రత్తలు పాటించాలని, పస్రా పోలీసు వారు తగు సూచనలు చేస్తున్నారు. ఈ పండుగల సందర్భంగా పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నామని అర్ధరాత్రి పూట గస్తీ కాస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు ఎస్ఐ కమలాకర్ పలు సలహాలు సూచనలు చేశారు. ఊరుకు వెళ్లే ముందు పేపర్ పాల ప్యాకెట్ వాళ్ళని మీరు వచ్చేవరకు రావద్దని చెప్పండి ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండా లాకర్లలో పెట్టండి మీ సిసి కెమెరాలు పనిచేస్తున్నయో లేవో చెక్ చేసుకోండి ఇంటి ఆవరణలో/హాల్లో లైట్ వెలిగేలా చూడండి ఇంటి ముందు ప్రతిరోజూ శుభ్రం చేయమని పనివాళ్ళకు చెప్పండి మీ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే 100కు డయల్ చేయాలని తెలిపారు.