సేద్యం చేసుకుంటున్న ప్రభుత్వ భూమికి పాస్ బుక్కులు ఇవ్వాలి..

Pass books should be given to government land under cultivation.– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
గత 60 సంవత్సరాలుగా హన్మాపురం గ్రామంలోని సర్వే నెంబరు 87 లోని 15 ఎకరాల 12 గుంటల భూమిని సేద్యం చేసుకుంటున్నా 14 ఎస్సీ కుటుంబాలకు వెంటనే నూతన పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  సోమవారం హన్మాపురం గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన భూమి సాగు దారులు, స్థానిక సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నర్సింహతో కలసి స్థానిక భువనగిరి మండల తహశీల్దార్ అంజిరెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 60 సంవత్సరాలుగా గ్రామంలోని దళిత ఎస్సీ కులానికి చెందిన 14 కుటుంబాలు వేలాది రూపాయలు ఖర్చు చేసి సమిష్టిగా భావి తొవ్వి, కరెంటు సాంక్షన్ ను తెచ్చుకొని మోటార్ తో నీటిని తోడి ఆ నీళ్లతో వ్యవసాయ పంటను పండించి తమ కుటుంబాలను పోషించుకున్నారని ఉన్నారు.
పలుమార్లు సేద్యం చేసుకుంటున్నా భూమికి పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ఆర్డిఓకు, స్థానిక తహసిల్దారుకు మెమోరండం ఇచ్చి మొరపెట్టుకుంటే ఇప్పటివరకు నూతన పాస్ బుక్స్ లు ఇవ్వలేదని ఆవేదన పడ్డారు. ఈ మధ్యకాలంలో భూమి పక్కనున్న కొంతమంది భూసాములు ఆ భూమిని కాజేయడానికి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా తక్షణం ప్రభుత్వము స్పందించి ఆ భూమిని సర్వే చేసి హద్దురాళ్ళు ఏర్పాటు చేయాలని, భూ అక్రమానికి ప్రయత్నిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సేద్యం చేసుకుంటున్నా 14 దళిత కుటుంబాలకు వెంటనే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని నర్సింహ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నర్సింహ, సాగుదారులు మూడుగుల ఉపేందర్, బిచ్చాల మైసమ్మ, బిచ్చల లక్ష్మయ్య, బిచ్చాల అండలు, బండారి నరసింహ, ముడుగుల బంగారి, ముడుగుల లింగమ్మ, సింగారం నరసమ్మ, ముడుగుల లింగయ్య, ముడుగుల స్వామి, ముడుగుల పెంటమ్మ, ముడుగుల నరసమ్మ, రాజు, మహేష్, బాల్ నరసింహ, రాము, జనార్ధన్, వెంకటయ్య, జీవన్, ఆంజనేయులు, సుధాకర్, బాల్ నరసింహ, జహంగీర్, రామచంద్రం, పరుష రాములు, బిక్షపతి, భారత్, దానయ్య, మల్లయ్య, కొండల్, భాను కుమార్, నవీన్, పెంటయ్య, ప్రభాకర్ లు పాల్గొన్నారు.