నవతెలంగాణ – మద్నూర్
ప్రైవేటు వద్దు ప్రభుత్వమే ముద్దు అనే విధంగా ప్రయాణికులు బస్సు ప్రయాణాలకే అధికంగా మగ్గుచూపడంతో ప్యాసింజర్ ఆటోలకు గిరాకులు లేక మద్నూర్ పాత బస్టాండ్ లో వేలవేల బోతున్నాయి. అధికారంలో గల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మహిళలతో పాటు పురుషులు కూడా కుటుంబ సమేతంగా ఎక్కడికైనా బస్సు ప్రయాణమే ముద్దు అన్న చందంగా బస్సుల్లోనే వెళ్లడం ప్రైవేటు ఆటోలకు గిరాకులు కరువయ్యాయి. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లేనప్పుడు ఆటోలకు భలే గిరాకీ ఉండేది. ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు పురుషులు బస్సు ప్రయాణమే కొనసాగించడం ప్యాసింజర్ ఆటోలకు గిరాకీ పూర్తిగా తగ్గిపోయినట్లు ఆటో డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.