– హుస్నాబాద్ ఆర్టీసీ డిఎం వెంకటేశ్వర్లు
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
తెలంగాణ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చిన టి 9 టికెట్ ను సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ ఆర్టీసీ డిఎం వెంకటేశ్వర్లు కోరారు. గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు ‘టి-9 టికెట్’ సమయాల్లో మార్పులు చేసిందన్నారు.పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని తెలిపారు. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్ చెల్లుబాటు అయ్యేదన్నారు .ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఎక్స్ప్రెస్ బస్ లో కూడా రూ.20/- కాంబి టికెట్ చెల్లించి కూడా ప్రయాణించే సదుపాయం కల్పించారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవలని కోరారు.