
విద్యార్థి దశ నుండి క్రీడలపై మక్కువ పెంచుకోవాలని జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ బాబు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర 9వ జూనియర్ బాలుర సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ధర్మసాగర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం ధర్మ ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, సెంట్రల్ జోన్ డిసిపి ఎం ఏ భారీ హాజరై ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని, ఈపాఠశాలలో అర్హత కలిగి, అనుభవం గడించిన ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు బోధించడం జరుగుతుందన్నారు. ఈ పాఠశాలలో విద్యతోపాటు ఆటపాటలను కూడా చెప్పడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాల మనుగడకు తమ వంతు సహకారాన్ని అందించాలి అన్నారు. అనంతరం విశిష్ట అతిథిగా హాజరైన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సెంట్రల్ జోన్ హనంకొండ ఎం ఏ భారీ మాట్లాడుతూ, విద్యార్థుల క్రమశిక్షణకు సత్ప్రవర్తకు, జట్టు భావన పెంపొందించుకునేందుకు, సరియైన కౌశలాలు అలవర్చుకునేందుకు క్రీడలు దోహదపడతాయి. ఇందుకోసం విద్యార్థులు పాఠశాల దశలోనే క్రీడల పట్ల మక్కువ పెంచుకొని తమకు నచ్చిన క్రీడలో ప్రావీణ్యం పొందాలని అన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్వాగత నృత్యం, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల దేశభక్తి నృత్యం ఆహుతులను అలరించింది. ఈ క్రీడా పోటీలలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి 300కు పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అజీజ్ ఖాన్, నవీన్ కుమార్, శోభన్ బాబు ,జడ్పిటిసి చాడ సరిత రెడ్డి ,మల్లికుదుర్ల మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, ధర్మసాగర్ ఎంపీటీసీ శోభా ,మాజీ ఉపసర్పంచ్ అరుణ ,హనుమకొండ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ బాధ్యులు రాజేందర్ సుమలత, ప్రసన్న, రమేష్ పాల్గొన్నారు.