పశుమిత్రలను కార్మికులుగా గుర్తించాలి

– వేతనాలు నిర్ణయించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పశుమిత్రలను కార్మికులుగా గుర్తించాలనీ, వారికి వేతనాలను నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, పశుమిత్ర వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసు మాధవి డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లో పశుమిత్ర కార్మికుల సదస్సు నిర్వహించారు. దీనికి శారద అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పశుమిత్రలు వేతనంగానీ, పారితోషికాలుగానీ లేకుండా పనిచేస్తున్నారని తెలిపారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పశుసంపదను కాపాడటంలో పశుమిత్రలదే కీలక పాత్ర అన్నారు. పశువులకు సోకే 12 నుంచి 20 రకాల వ్యాధులను వారు నయం చేస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పశుమిత్రలకు మోసం చేసిందన్నారు. ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ సదస్సులో సమ్రీన్‌, ప్రియాంక, విజయ, వీరమ్మ, రాజేశ్వరి, సంధ్య, తార, మెహరాజ్‌, లలిత, తదితరులు పాల్గొన్నారు.