సీఎం రేవంత్ ను కలిసిన పటేల్ రమేష్ రెడ్డి

నవతెలంగాణ – సూర్యాపేట
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని  నివాసంలో పటేల్ రమేష్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాలువా, బొకే లతో సీఎంను సన్మానించారు. తనపై ఉంచిన గురుతర బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని రమేష్ రెడ్డి సీఎం తో పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట ఉన్న ఆర్ అండ్ బి& సినీమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి రమేష్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.