నవతెలంగాణ-లోకేశ్వరం
మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన కుర్రాడి లక్ష్మి గంగారాం దంపతులకు నలుగురు కుమారులు కాగా, అందులో శ్రీనివాస్(32), గంగన్న(35) ఇద్దరు కుమారులు పుట్టినప్పటి నుంచి మానసిక దివ్యాంగులగా ఉన్నారు. దివ్యాంగులను ఎన్నో ఆస్పత్రులకు చికిత్స కోసం తిరిగి వారికి నయం కాలేదు. కనీసం నడవలేరు. వీళ్లు బయటకు వెళ్లాలంటే తల్లిదండ్రులు మోయాల్సిందే లక్ష్మి తన కుమారులకు చేస్తున్న సేవలు చూస్తే అందరి గుండెలు తరుక్కుపోతాయి. పాతికేండ్లకు పైగా వయస్సున్న ఇద్దరు కొడుకులు ఇప్పటికీ చంటి బిడ్డల్లా సేవలు చేస్తోంది. పుట్టుక నుంచి శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ అన్ని సేవలు చేస్తూ వృద్ధాప్యంలోనూ ఆ మాతృమూర్తి మోస్తున్న భారం వర్ణనాతీతం ఈ మానసిక వికలాంగులకు ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబీకులు కోరుతున్నారు.