– సీెపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీ.ఎస్ బోస్
– కోంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు తరలిన నేతలు
నవతెలంగాణ-కాప్రా
కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి విజయం తథ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీ.ఎస్ బోస్ అన్నారు. సోమవారం సీపీఐ ఉప్పల్, ఈసీఐఎల్ నేతలు సునీతామహేందర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా వీ.ఎస్ బోస్ మాట్లాడుతూ.. ప్రజల కష్టసుఖాలు తెలిసిన సునీతామహేందర్‌రెడ్డిని ప్రజలు ఆదరించాలన్నారు. ప్రజా సమస్యలపై గళం వినిపించే సునీతను పెద్దల సభ కు పంపాల్సిన బాధ్యత మల్కాజి గిరి పార్లమెంట్ ఓటర్లదేనని ఉద్ఘాటించారు. అందుకే సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనను న్నామని పేర్కొన్నారు. త్వరలోనే సీపీఐ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అభ్యర్థి ని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జీ. దామోదర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎస్. శంకర్ రావు, ఉప్పల్ మండల కార్యదర్శి పి. రామ్ నారాయణ, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్యప్రసాద్, లక్ష్మీనారాయణ, ఎన్. నర్సింహా, నర్సింహా రావు, మిరియాల సాయిలు, స్వామిదాస్, జాన్ తదితరులు పాల్గొన్నారు.