
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్ వాయి పరిధిలోని డిచ్ పల్లి,ఇందల్ వాయి మండలాల పరిధిలో పాల్స్ పోలియో చుక్కలు మొదటి రోజు విజయవంతం అయినట్లు అసుపత్రి వైద్యులు డాక్టర్ సంతోష్ కుమార్, అరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ ఆదివారం తెలిపారు. ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామానికి దగ్గరగా నున్న కే కే తాండ లోని 0-5 సంవత్సరముల పిల్లలకు ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ పోలియో చుక్కలు వేశారు .అలాగే రేపు మరియు ఎల్లుండి ఇంటింటికి తిరిగి పల్స్ పోలియో వ్యాక్సిన్ వేసుకొని పిల్లలందరికీ వేయడం జరుగుతుంది 0-5 ఇయర్స్ పిల్లలు లక్ష్యం లక్ష్యం 7900 గా పెట్టుకోవడం జరిగిందని వివరించారు. అందులో 93% కంప్లీట్ చేయడం జరిగిందని తెలిపారు. 21 హైరిస్ కి ఏరియాలలో మొబైల్ టీములు అరేంజ్ చేసి వాటి ద్వారా ఇటుక బట్టీలలోనూ కంకర మిషన్ లోను దూర ప్రాంతం తాండాలలోనూ చిన్న పిల్లలు ఉన్నట్లయితే వారికి పోలియో చుక్కలు వేశారు.రైల్వే స్టేషన్ , బస్టాండ్ లలో చుక్కల కేంద్ర లను ఏర్పాటు చేశారు.తెలంగణ ప్రత్యేక పోలీసు ఎడవ బెటాలియన్ లో కమాండెంట్ బి రాంప్రకష్ అద్వర్యంలో చిన్నారులకు చుక్కలు ముందు వేశారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ ,ఆరోగ్య కార్యకర్తలు వెంకట్రెడ్డి, ఆనంద్, అంగన్వాడీ ,అశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.