రూ.411 కోట్ల నిధుల సమీకరణలో పావ్నా ఇండిస్టీస్‌

హైదరాబాద్‌ : ఆటోమోటివ్‌ విభాగాల తయారీలో ఉన్న పావ్నా ఇండిస్టీస్‌ రూ.410.81 కోట్ల నిధుల సమీకరణకు ఆ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. ఇందుకోసం వాటాదారులు, రెగ్యూలేటరీ సంస్థల ఆమోదానికి లోబడి కన్వర్టిబుల్‌ వారెంట్లను జారీ చేయనున్నట్లు పేర్కొంది. యునికో గ్లోబల్‌ అపర్చునిటీస్‌ ఫండ్‌, నెక్ప్‌పాక్ట్‌, నార్త్‌స్థార్‌ అపర్చునిటీస్‌ ఫండ్‌ విసిసి, ఎమినీ గ్లోబల్‌ ఫండ్‌ పిసిసి, ఎజి డైన మిక్‌ పండ్స్‌ లిమిటెడ్‌ సంస్థల నుంచి నిధులు పొందాలని ప్రతిపాదించింది.