బీసీ విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులుగా దొంగరి పవన్ కళ్యాణ్..

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
బీసీ విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా దొంగరి పవన్ కళ్యాణ్ ని నియమిస్తున్నట్లు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య శనివారం నియామక పత్రం అందజేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం, విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకే పోరాడాలని ఆయన సూచించారు. తన నియామకానికి సహకరించిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులుగా వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కేసరపు గోవిక్, కార్యదర్శిగా ఉమేష్, ఉపేందర్ లను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.