సమస్యలు పరిష్కరించడానికి సిద్ధం.. బకాయిలు చెల్లించండి

Prepare to solve problems.. Pay duesనవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించిన 23 దుకాణ సముదాయాల బకాయిలను పూర్తి డబ్బులు చెల్లించాలని ఇన్చార్జి ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి తెలిపారు. టెండర్లలో దక్కించుకున్న వ్యక్తులతో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. టెండర్ లో పాల్గొని డబ్బులు కట్టని వారు కట్టాలని, డబ్బులు చెల్లించిన వారు కిరాయి చెల్లించాలని సూచించారు. అనంతరం సదరు వ్యక్తులు మాట్లాడుతూ.. మౌలిక వసతులైన మంచినీటి కులాయి, డ్రైనేజీ, బాత్రూంలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే కిరాయి వెయ్యి రూపాయల కంటే ఎక్కువ చెల్లించలేమని తెలిపారు. వీలైనంత తొందరలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ తెలిపారు. వ్యక్తుల నుండి పూర్తిస్థాయిలో నివేదిక తీసుకొని ఉన్నత అధికారులకు తెలియజేస్తామని, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు.